యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ చిత్రంగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానటువంటి సబ్జెక్టుతో ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ని ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ గా చూస్తారని కూడా నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ చాలా సందర్భాలలో చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ టైం జోన్ లో ఈ సినిమా కథ మొత్తం నడుస్తుందని, అస్సలు ప్రెజెంట్ అనేది ఉండదని తెలుస్తుంది. ఆ ఫ్యూచర్ టైం జోన్ కి తగ్గట్లుగానే కథలో కొత్తరకం వెహికల్స్ అలాగే టెక్నాలజీ అడ్వాన్సడ్ టైం జోన్ లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనే ఊహాజనితమైన అంశాలతో నాగ్ అశ్విన్ ఈ కథని సిద్ధం చేసుకొని దానికి తగ్గట్లుగానే స్టోరీ బోర్డు సిద్ధం చేయించుకున్నాడని తెలుస్తుంది.
ఇక నలుగురు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ మూవీ కోసం పని చేస్తున్నారని, అలాగే హాలీవుడ్ కి చెందిన ఆర్ట్ డైరెక్టర్స్ అత్యాధునిక వెహికల్స్, ఆయుధాలు అలాగే సినిమా బ్యాగ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా మెయిన్ సబ్జెక్టు గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. కురుక్షేత్రం సంగ్రామం ఈ ప్రపంచంలో జరిగే మొట్టమొదటి ప్రపంచ యుద్ధంగా ఇండియన్స్ భావిస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలు అన్ని కూడా కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాయని చెబుతారు. అలాగే 11 రోజుల పాటు అడ్వాన్సడ్ టెక్నాలజీకి మించి పవర్స్ ఉన్న ఆయుధాల్ని ఆ యుద్ధంలో ఉపయోగించారని, అందుకే కేవలం 18 రోజులలో ముగిసిపోయిందని చాలా మంది నమ్ముతారు.
అదే ఆ కురుక్షేత్ర సంగ్రామమే మూడో ప్రపంచ యుద్ధం అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ కథని నాగ్ అశ్విన్ సిద్ధం చేసుకొని వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని ఆవిష్కరించినట్లు టాక్. భవిష్యత్తులో ఇండియా ప్రపంచంలోనే సూపర్ పవర్ గా మారుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ థర్డ్ వరల్డ్ వార్ కి కూడా భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందా అనే ఎలిమెంట్ తో అర్జునుడి పాత్ర స్ఫూర్తితో ప్రభాస్ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇలా కురుక్షేత్ర సంగ్రామాన్ని అడ్వాన్స్ గా చూపించాలనే నాగ్ అశ్విన్ థాట్ ఏ పేరుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకి రీచ్ అవుతుందనేది చూడాలి.