యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ చిత్రంగా ఈ మూవీని దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ఇక దీపికా పదుకునే, దిశా పటాని ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అడ్వాన్స్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫ్యూచర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. దీనికోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. వెహికల్స్ నుంచి వాడే వస్తువులు అలాగే చుట్టూ వాతావరణం అన్నింటిని కూడా ప్రస్తుతం ఉన్నదానికి భిన్నంగా చూపించే విధంగా నాగ్ అశ్విన్ ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం సెట్ వర్క్ తో పాటు గ్రాఫిక్స్ కూడా వినియోగిస్తున్నారు.
ఇక ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ యానిమేషన్ కూడా నేర్చుకున్నాడు అంటేనే ఎంత కసిగా మూవీపై ఉన్నాడో అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథని ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ చెప్పబోతున్నాడు అనే విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అమితాబచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ కె నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసి అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ పోస్టర్ లో ఒక చెయ్యిని మాత్రమే చూపించారు. అయితే ఆ చెయ్యిని చూపించే విధానంలో మాత్రం ఒక మహా వీరుడు కనిపిస్తున్నాడు. దానికి లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్దల్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
ఈ పోస్టర్ తో సినిమా టైటిల్ ప్రాజెక్ట్ కె అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది. అలాగే ఇందులో అమితాబచ్చన్ పాత్ర పురాణకాలానికి సంబంధించినది అయ్యి ఉంటుందనే మాట వినిపిస్తుంది. ట్యాగ్ లైన్ బట్టి చూసుకుంటే పురాణాల ప్రకారం చిరంజీవులుగా ఉన్న లెజెండ్స్ అంటే అశ్వద్ధామ, హనుమంతుడు, పరశురాముడు కనిపిస్తారు. మరి ఈ ముగ్గురిలో ఒకరికి సంబందించిన పాత్రని అమితాబచ్చన్ ఈ మూవీలో పోషించాడని అర్ధమవుతుంది. అయితే మెజారిటీ ఆడియన్స్ నుంచి వస్తున్న మాట ప్రకారం పరశురాముడు పాత్రలో అమితాబచ్చన్ కనిపిస్తాడని టాక్. అలాగే ప్రభాస్ ఈ మూవీలో మహా విష్ణువు చివరి అవతారం అయిన కల్కిగా కనిపిస్తాడని, ఈ ప్రపంచంలో అతను చేసిన యుద్ధం నేపధ్యంలో కథాంశం ఉంటుందని టాక్ నడుస్తుంది. అదే మూడో ప్రపంచ యుద్ధంగా ఉండబోతుందని నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సినిమా ద్వారా చెప్పబోతున్నాడని టాక్.