హాలీవుడ్ ను బీట్ చేసే ఇండియన్ మూవీస్ ఇప్పటివరకు రాలేదు. హాలీవుడ్ సినిమాలు వేల కోట్ల బడ్జెట్తో వుంటాయి. ఒక సినిమా తీయడానికి కనీసం వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు సమయం తీసుకుంటారు. షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. హై స్టాండర్డ్ విజువల్స్, గ్రాఫిక్స్ తో హాలీవుడ్ సినిమాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మార్వెల్ సిరీస్ కి చెందిన సూపర్ హీరో కథలు ఎక్కువగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంగ్లీష్ కామిక్ స్టోరీలు ఆధారంగా హాలీవుడ్ సినిమాలు రూపొందిస్తూ ఉంటారు. అయితే ఇండియన్ సినిమా శైలి హాలీవుడ్ కి చాలా భిన్నంగా ఉంటుంది. ఫోక్ స్టోరీస్ మీద ఇండియన్ క్రియేటర్స్ ఎక్కువగా డిపెండ్ కారు.
సొంత కథలు తోనే ఇండియన్ నేటివిటీకి దగ్గరగా ఉండే కథనాలను తీసుకొని సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ కూడా కాస్త పెరిగింది. వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అదే సమయంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ దారిలోనే మరి కొంత మంది దర్శకులు పాన్ ఇండియా ఖాతాలతో ఇండియన్ ఆడియన్స్ మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అశ్వినీతత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కె అనే మూవీ తెరకెక్కుతుంది.
పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ గా, హాలీవుడ్ రేంజ్ లో ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి స్టార్ కాస్టింగ్ సినిమాలో ఉన్నారు. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత అశ్వినీదత్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రాజెక్ట్ కె మూవీ హాలీవుడ్ అవెంజర్స్ సిరీస్ స్థాయిలో ఉంటుందని తెలిపారు. అలాగే ఈ సినిమాతో అమెరికా, చైనా మార్కెట్ పైన కూడా ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీన్నిబట్టి ఈ సినిమాని ఇండో వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా అలరిస్తుందా లేదా అనేది వేసి చూడాలి.