Production No 1: పృథ్విరాజ్, అనూ మెహత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1. ఈ సినిమాను పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా రాబరి నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమా ద్వారా పి మణిరాజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. పి.నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఒక కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కనుంది. కానీ ఈ సినిమా టైటిల్ ఇంతవరకు ఏంటి అన్నది తెలియలేదు.
అయితే ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా దర్శకుడు పి మణిరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను 27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపినట్టు తెలిపారు.
అలాగే ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని, హీరో పృథ్విరాజ్, హీరోయిన్ అనూ మోమత చక్కగా నటించింది అని చెప్పుకొచ్చారు మణిరాజ్. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని తెలిపారు దర్శకుడు మణిరాజ్. కాగా ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌లో ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి తరహాలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.