ఇండియన్ సినిమా హిస్టరీ చూసుకుంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని ఇకపై ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా చదువుకోవాల్సి వస్తుంది. ఆ స్థాయిలో ఇండియన్ సినిమా స్థాయిని, అలాగే దర్శకులు, హీరోల ఆలోచనలని పూర్తిగా మార్చేసిన చిత్రంగా బాహుబలి సిరీస్ నిలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా చేసి ఇండియన్ సినిమా అనే పేరుని ప్రపంచానికి గట్టిగా వినిపించేలా చేసిన క్రెడిట్ కచ్చితంగా ప్రభాస్ కి దక్కుతుంది. దర్శకుడిగా రాజమౌళికి ఆ క్రెడిట్ దక్కిన హీరోలకి వచ్చేసరికి ప్రభాస్ ఆ ఇమేజ్ ని ఎత్తుకుపోతాడు. 4 ఏళ్ళ పాటు అతను బాహుబలి సినిమా కోసం పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఈ క్రెడిట్ అని చెప్పాలి.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి కూడా మారిపోయింది.. అతని మీద 500 కోట్లు బడ్జెట్ అయిన పెట్టడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. అలాగే ఫైనాన్షియర్స్ కూడా ప్రభాస్ సినిమా అంటే ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి అయినా రెడీ అవుతున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీలు ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి ప్రభాస్ ఒక రూట్ మ్యాప్ గా మారిపోయాడు. అతని మీద ఎంత బడ్జెట్ పెట్టిన కంటెంట్ బాగుంటే అంతకు రెట్టింపు కలెక్ట్ చేస్తుందనే నమ్మకం నిర్మాతలలో పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు ఫెయిల్యూర్ అయినా కూడా దానికి దర్శకులు కారణం అయ్యారు తప్ప ప్రభాస్ కాదు.
ఆ సినిమాల కోసం ప్రభాస్ పెట్టిన డెడికేషన్, ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్ లో కూడా కనిపిస్తుంది. అందుకే సరైన కంటెంట్ పడితే ప్రభాస్ లాంటి కటౌట్ కి కచ్చితంగా బ్లాక్ బస్టర్ పక్కా అని నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలోనే భారీ రెమ్యునరేషన్స్ కూడా అతనికి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఏకంగా అతనికి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఒక వైపు యూవీ క్రియేషన్స్ తో తన చిత్రాలకి నిర్మాణ భాగస్వామిగా ఉంటూ రెమ్యునరేషన్స్ కూడా భారీగానే ప్రభాస్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇక అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఏకంగా 700 నుంచి 800 వరకు రెమ్యునరేషన్ రూపంలోనే ప్రభాస్ అందుకుంటూ ఉండటం విశేషం. భారీ కథలని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాలంటే ప్రభాస్ లాంటి కటౌట్ ఉండాలని దర్శకులు కూడా భావిస్తున్నారు. ఇక ప్రభాస్ తో సినిమా అంటే థీయాట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఈ కారణంగానే నిర్మాతలు ఏ మాత్రం సంకోచం లేకుండా డార్లింగ్ మీద భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు.