Viral News : రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలే ఆమె టార్గెట్. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మంచి సౌండ్ పార్టీలను వెదుక్కోవడం.. ఆపై వలపు వల విసిరడం.. ముగ్గులోకి దిగిన వారిని నవ్వించి.. కవ్వించి.. మొత్తానికి వారిని బయటకు రానివ్వకుండా లాక్ చేసి పడేసి ఆపై అందినకాడికి దోచుకుంటుంది. ఇక్కడో ఆసక్తిర విషయం కూడా ఉందండోయ్.. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. లాలో లూప్ హోల్స్ వెదికి మరీ లాక్ చేసేస్తోంది. ఎన్ని చేస్తే ఏమీ పోలీసులకు మాత్రం అడ్డంగా దొరికిపోయింది. ఖండగిరి పోలీసులు శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు.
అయితే అమ్మడి అరెస్ట్ విషయమై మాత్రం పోలీసుల నుంచి అధికారికంగా సమాచారం ఏమీ అందలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలేమీ కుమారి కాదు.. శ్రీమతే.. ఇది వరకే ఆమెకు వివాహమైంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. అమ్మడి రాస కళలకు భర్త సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయట. భర్త సహకారంతోనే ప్రముఖులను ముగ్గులోకి దింపి.. నిలువునా దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఫేసుబుక్‌ను ఆసరాగా తీసుకుని ప్రముఖుల వివరాలను సేకరించి, సన్నిహిత పరిచయాలు పెంచుకుంటుంది.
అంతటితో ఆగుతుందా? తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆనందంగా రెడీ అయి ఎగురుకుంటూ వెళ్లిన వారిని ఏమాత్రం డిజప్పాయింట్ చేయదు. అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది. ఇక ఈ సమయంలోనే ఫోటోలు, వీడియోలను సైతం తీస్తుంది. ఆ తరువాత ఉంటుంది అసలు కథ. వాటిని చూపించి బెదిరించి ఓ రేంజ్‌లో డబ్బులు గుంజుతుంది. అమ్మడి వలలో చిక్కిన వారిలో మాజీ మంత్రులు, నాయకులు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు ఉన్నారు. ఒక నిర్మాత ఖండగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలింది. అమ్మడి లీలలన్నీ బయటకు వచ్చాయి.