Pro Kabaddi League Telugu Titans: ఎంతో ఉత్సాంగా, పోటా పోటీగా ఆడిన తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్ ఓటమితో మొదలైంది. శుక్రవారం బెంగళూరు బూల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 – 29 తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ నుంచి రజినీష్ (ఏడు పాయింట్లు), కెప్టెన్ సిద్ధార్థ్ దేశాయ్ (4 పాయింట్లు), వినయ్ (ఏడు పాయింట్లు)తో సాధించారు. అయితే చివరి నిమిషంలో తెలుగు టైటాన్స్ తప్పులు చేయడం బెంగళూరు బుల్స్‌కు కలిసివచ్చింది. ఇదే కాకుండా ఇతర మ్యాచ్‌లలో కూడా దబాంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ ఆట మొదలుపెట్టారు.
ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్ స్టార్ ప్లేయర్ పర్‌దీప్ నర్వాల్ ఏడు రైడింగ్ పాయింట్లతో మెరివగా సురేందర్ గిల్ తొమ్మిది పాయింట్లు సాధించాడు. ఇంకో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 34 -32 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ స్టార్ డిఫెండర్స్ రవీందర్ పెహల్, విశాల్ భరద్వాజ్ ట్యాక్లింగ్‌లో చాలా ఘోరంగా ఓడిపోయారు. ఇంకో వైపు బెంగళూరు బుల్స్ నుంచి నీరజ్ తో సహా స్టార్ రైడర్ వికాస్ ఖండోలా, భరత్ బాగా ఆడటం జరిగింది.
Pro Kabaddi League Telugu Titans:
ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో దబాండ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగాడు. జైపూర్ పింక్ ఫాంథర్స్ ప్లేయర్ అర్జున్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధాస్‌కు జైపూర్ పింక్ ఫాంథర్స్ గట్టి పోటీ ఇచ్చింది. మరో మ్యాచ్‌లోనూ ముంబాపై దబాంగ్ ఢిల్లీ 41-27తో విజయాన్ని సాధించింది.