ఐపిఎల్ పూర్తయిన రోజుల వ్యవధిలోనే టి20 వరల్డ్ కప్ మొదలు కానున్నది.ఈ టోర్నమెంట్ ను భారత్ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది.ఈ టోర్నీలో భారత పై గెలిస్తే పాకిస్తాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు టోర్నీ హిట్ ను మరింత పెంచాయి.
దాన్ని మరింత పెంచేందుకు తాజాగా ఐసిసి ఈ టోర్నీని ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసింది.ఇందులో ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన వారికి సుమారు 12 కోట్ల ప్రైజ్ మనిని, రన్నర్స్ గా నిలిచిన వారికి 6 కోట్ల ప్రైజ్ మనిని ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.అలాగే సూపర్ 12 స్టేజిలో గెలుపొందిన ప్రతి టీమ్ కు 30 లక్షల రూపాయిలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.పేపర్ మీద బలంగా ఉన్న అన్ని టీమ్స్ గ్రౌండ్ లో ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తాయో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.