Priyanka Mohan: హీరోయిన్ గా ప్రారంభంలో తెలుగు, మలయాళం చిత్రాలలో నటించిన ప్రియాంక మోహన్ తరువాత కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది.
తమిళంలో “డాక్టర్” అనే సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాతో అద్భుతమైన విజయం సాధించింది.
ఆ తర్వాత డాక్టర్ సినిమా హీరోతో మరో రొమాంటిక్ చిత్రం డాన్ సినిమాలో నటించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
వరుసగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు రావడంతో తమిళంలో ప్రియాంక మోహన్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అనే పేరు సంపాదించింది.
ఈ క్రమంలో హీరో సూర్యకి జంటగా నటించిన “ఎదుర్ముమ్ తునిందవన్” సినిమా నిరాశపరచడం జరిగింది.
కాగా రజనీకాంత్ కొత్త సినిమా “జైలర్” లో మొదట ప్రియాంక మోహన్ కి అవకాశాలు రావడం జరిగింది.
కానీ అనుకోని కారణాలవల్ల ప్రియాంక మోహన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంది.
ఒకపక్క అవకాశాలు వస్తూ మరోపక్క సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోషూట్స్ తో ప్రియాంక మోహన్ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ గా ప్రియాంక మోహన్.. చీర కట్టులో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పూర్తిగా క్లాసిక్ లుక్ లో … సారీతో పాటు జువెలరీ ధరించి అధరహో అనిపించింది.