Priyanka Goswami : ప్రియాంక గోస్వామి భారత్‌కు చెందిన అథ్లెటి. తన నడకతో టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాన్ని పొంది 17వ స్థానంలో నిలిచింది. కామన్‌వెల్త్ లోనూ 10వేల మీటర్ల నడక పోటీలో రజతాన్ని సాధించి తన సత్తాను చూపింది. అథ్లెట్‌గా ట్రాక్ రికార్డ్ ఉన్నా ప్రియాంక గోస్వామి భవిష్యత్తులో మోడలింగ్ వైపు దృష్టి సారిస్తానని చెప్పి అందరినీ అవాక్కు చేసింది.

2010 లోనే ఫ్యాషన్‌ను కెరీర్‌గా తీసుకోవాలని ప్రియాంక గోస్వామి భావించారట. పాలిటెక్నిక్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కోసం అప్లై కూడా చేసిందట. అయితే ఆ కోర్సు చేయలేకపోయానని ప్రియాంక చెప్పుకొచ్చింది. అప్పుడే క్రీడల వైపు తన ఫోటో షిప్ట్ అయ్యిందని ఓ ఇంటర్వూలో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది గోస్వామి. ఇప్పుడు అథ్లెట్ గా సక్సెస్ అయినప్పటికీ ఎప్పుడూ తన డ్రెస్సింగ్‌లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నానంటోంది. తాను ధరించిన ప్రతి అవుట్‌ఫిట్‌కు తన ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుతాయని తెలిపింది.

తాను ఎప్పుడూ దేశం కోసం పతకాలు గెలవాలని కలలు కనడంతో పాటు ఫోటో షూట్‌లను చేస్తూ ఉంటానని తెలిపింది. ఈ మధ్యనే ఫ్యాషన్ డిజైనర్ తన్మయ ద్వివేది రూపొందించిన అవుట్‌ఫిట్‌ను ధరించి ఓ ఫోటో షూట్ చేసి ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్ చేసింది ఈ అథ్లెటిక్ బ్యూటీ. భవిష్యత్తులో మోడలింగ్ చేపట్టాలని అనుకుంటున్నట్లు ఫ్యాషన్ పై తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది. భారత దేశం కోసం మరిన్ని పతకాలు సాధించిన తరువాత యాడ్ షూట్‌లు, ఫ్యాషన్ ఫోటో షూట్‌లు చేయాలని ఆశిస్తోంది.

అథ్లెట్స్‌పై ఆసక్తిని పెంచుకున్నప్పటికీ ఆట గురించి పూర్తిగా తెలియదని ప్రియాంక తెలిపింది. మొదటి సారి పోటీలకు వెళ్లినప్పుడు అన్ని ఎంట్రీలు మూసివేయబడ్డాయని, ఆ సమయంలో ట్రావెలింగ్ బ్యాగ్ గెలుచుకునే అవకాశం ఉన్న నడక పోటీల్లో పాల్గొని విజేతనయ్యాని ఆ బ్యాగ్‌ని నా సొంతం చేసుకున్నానని తన ఫస్ట్ విన్నింగ్ మూమెంట్‌ను తెలిపింది ప్రియాంక. మన్‌కి బాత్ ప్రోగ్రామ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తన పేరును ప్రస్తావించడం చాలా సంతోషంగా , గర్వంగా అనిపించిందని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఒలింపిక్ మెడల్‌పైనే ఉందని స్పష్టం చేసింది.
