దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇచ్చారు.నిత్యావసరాలు రేట్లను అమాంతం పెంచేసి ఈ పాపం మాది కాదని కథలు చెబితే ఊరుకోమని తేల్చి చెప్పారు.దీంతో ప్రజా వ్యతిరేకతను తగ్గించే పనిలో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది.దీంతో పెట్రోల్ లీటర్ పై 5 రూపాయిలు,డీజల్ లీటర్ పై పది రూపాయిలు తగ్గింది.
తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల ఫలితాలకు భయపడి బిజేపి పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించింది కానీ మనస్ఫూర్తిగా తగ్గించలేదు.వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.