Priyanka Chopra : బాలీవుడ్ కమ్ హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జొనాస్ న్యూయార్క్ సిటీలో సందడి చేస్తున్నారు. ఇటీవల ఈ క్యూట్ కపుల్ తమ అభిమాన వ్యక్తుల కోసం న్యూయార్క్ సిటీలో ఫేమస్ రెస్టారెంట్ సోనాలో డిన్నర్ పార్టీని హోస్ట్ చేశారు. గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్, ఎఫ్‌సీ ఫెస్టివల్, యునైటెడ్ నేషన్స్ జెనరల్ అసెంబ్లీ, ఫ్రోబ్స్ ఫిలాంత్రపీ సమ్మిట్ ఇలా డిఫరెంట్ ఈవెంట్స్‌కు హాజరయ్యేందుకు రీసెంట్‌గా ఈ జంట న్యూయార్క్ సిటీకి వచ్చింది. ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ ఈ జంట తమ ఆత్మీయుల కోసం డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసింది.

నోబెల్ పీస్ ప్రైజ్ విజేత మలాలా యూసఫ్‌జాయ్, డిజైనర్ ప్రబల్ గురంగ్, లారా బ్రౌన్, రాధికా జోన్స్, సరితా చౌదరీలకు ఆతిధ్యం ఇచ్చారు. స్టార్స్‌తో నిండిన ఈ అకేషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రియాంక చోప్రా. బ్లాక్ అవుట్ ఫిట్‌లో తారలా మెరిసింది.

Priyanka Chopra : తాజాగా ప్రియాంక చోప్రా నిక్ జొనాస్ తమ ఇన్‌స్టాగ్రమ్ ప్రొఫైల్‌లో న్యూయార్క్‌లో రెస్టారెంట్ సోనాలో చేసిన డిన్నర్ డేట్‌కు సంబంధించిన స్నిప్పెట్స్‌ను పోస్ట్ చేశారు. ఈ పిక్స్ కింద నైట్ అవుట్ విత్ సమ్ ఆఫ్ మై ఫేవరేట్స్ అని నిక్ క్యాప్షన్‌ను జోడించగా , డిన్నర్ ఎట్ బెస్ట్ రెస్టారెంట్ ఇన్ న్యూయార్క్ విత్ మై లవ్ అని ప్రియాంక క్యాప్షన్‌ను జోడించింది. ఈ డిన్నర్ డేట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది ప్రియాంక చోప్రా, బ్లాక్ లెస్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుని ఊపిరాడకుండా చేసింది. న్యూయార్క్ బేస్డ్ క్లాతింగ్ లేబుల్ ఖైతే నుంచి ఈ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను సేకరించింది. ఈ డిజైనర్ పీస్ క్లాతింగ్ లేబుల్ వెబ్‌సైట్‌లో దాసా డ్రెస్ అని అందుబాటులో ఉంది . దీని ధర అక్షరాలా రూ. 2 లక్షలు.

భర్తతో తన ఫేవరేంట్ రెస్టారెంట్‌లో చేస్తున్న డిన్నర్ డేట్ కోసం ప్రియాంక చోప్రా ఈ బ్లాక్ లెస్ డ్రెస్ వేసుకుని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. లైట్ వెయిట్‌లో ఇటాలియన్ క్రేప్ జెర్సీలో అత్యంత సౌకర్యవంతంగా హై రైజ్ హాల్టర్ కాలర్ నెక్‌తో ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు. పొడవాటి స్లీవ్స్ భుజం దగ్గర వచ్చిన కట్ అవుట్‌లు , లేస్‌తో కనెక్ట్ చేసిన బ్యాక్ పార్ట్, స్కర్ట్ మాదిరిగా వచ్చిన ప్లీట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా పాదాలకు పాయింటెడ్ హీల్స్ వేసుకుని, చెవులకు బంగారపు హూప్ రింగ్స్ , చేతికి గోల్డ్ బ్రేస్‌లెట్, చేతి వేళ్లకు ఉంగరాలను అలంకరించుకుంది. తన కురును మధ్యపాపిట తీసి లూజ్‌గా వదులుకుని అదరగొట్టింది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, వింగెడ్ ఐ లైనర్, న్యూడ్ లిప్ షేడ్ వేసుకుని మెరిసేటి ఛర్మంతో అందరిని మెస్మరైజ్ చేసింది.
