Priyanka Chopra : ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ప్రియాంక చోప్రా నిక్ జోన్స్ వైవాహిక బంధం మరింత స్ట్రాంగ్‌గా మారుతోంది. తాజాగా నిక్ బర్త్‌డే సందర్భంగా సప్రైజ్ పార్టీని ప్లాన్ చేసింది ప్రియాంక. ఫ్రెండ్, అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకమైన ప్రదేశంలో నిక్ 30వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది ప్రియాంక్. గోల్ఫ్ థీమ్ పార్టీని నిర్వహించిన ప్రియంక ఈ సందర్భంగా తెల్లటి స్లిప్ డ్రెస్‌ను ధరించి ఏంజెల్‌లా మెరిసిపోయింది. ప్రస్తుతం నిక్ బర్త్‌డే పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక ప్రేమను చూసిన నెటిజన్లు ఆమెన పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Priyanka Chopra : బీలీవుడ్ కం హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సింగర్ భర్త నిక్ జోన్స్ ఈ సెప్టెంబర్ 16న 30వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ స్వీట్ కపుల్ ప్రత్యేకమైన విమానంలో గోల్ఫ్ థీమ్‌తో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ‌్యులు,స్నేహితుల మధ్యన బర్త్‌డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన స్నిప్పెట్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. నిక్‌కి క్రీడలంటే చాలా ఇష్టం. అందుకే పార్టీని ఈ విధంగా సెట్ చేసింది.

ఈ పార్టీలో పాల్గొన్న వారంతా వైట్ డ్రెస్సు కోడ్‌తో అలరించారు. గోల్ఫ్ సెషన్స్ తో పాటుగా గోల్ఫ్ థీమ్ కప్‌కేక్స్ ను కూడా అతిథులకోసం సిద్ధం చేసింది ఈ బ్యూటీ. ఈ పార్టీలో బర్త్‌డే బాయ్ కన్నా ప్రియాంక హైలెట్‌గా నిలిచింది. వైట్ స్లిప్ డ్రెస్‌లో అదరగొట్టింది ప్రియాంక. ఆమె అవుట్‌ఫిట్ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు. బర్త్‌డే ఫోటోలను , వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసి హాప్పియెస్ట్ బర్త్‌డే మై లవ్ అని ఈ ఫోటోల కింద క్యాప్షన్‌ను జోడించింది.

ప్రియాంక వేసుకున్న డ్రెస్ విషయానికి వస్తే తెల్లటి సహజమైన సమిష్టి స్పగెట్టీ స్ట్రాప్స్‌ను కలిగి ఉంది. కౌల్ నెక్‌లైన్‌ను ప్లంగింగ్ డీటైల్స్‌తో వచ్చి , తొడ వరకు చీలికతో ఉన్న ఈ గౌనులో ప్రియాంక అందం రెట్టింపైంది. టైట్ ఫిట్ డీటైల్స్ తో వచ్చిన ఈ డ్రెస్ ప్రియాంక అందాలను నొక్కి మరీ చూపిస్తున్నాయి. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ప్రియాంక పీప్ టో హై హీల్స్ వేసుకుంది. మెడలో ఎం పెండెంట్‌తో ఉన్న బంగారపు చైన్‌ను వేసుకుంది. చెవులకు డ్యాంగ్‌లింగ్ ఇయర్ రింగ్స్ , చేతికి బ్రేస్‌లెట్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో మెస్మరైజ్ చేసింది. తన కురులను మధ్య పాపిట తీసుకుని లూజ్‌గా వదిలింది. పెదాలకు రెడ్ లిప్ షేడ్ పెట్టుకుని అందరిని అట్రాక్ట్ చేసింది. డివీ బేస్ మేకప్‌తో ఈ భామ తన అందంతో హల్ చల్ చేసింది.
