Priyanka Chopra : ప్రియాంక చోప్రా అందమైన పసుపు రంగు చీరలో అదరగొడుతోంది. లాస్ ఏంజిల్స్ పర్యటనలో ఉన్న ఈ భామ , దేశీ గర్ల్ లుక్‌తో సరికొత్త గ్లామర్ ను తీసుకువచ్చింది. కర్వా చౌత్ కావడంతో ఫ్యాషన్ ప్రియులకు ఫెస్టివ్ ఫ్యాషన్‌ను పరిచయం చేస్తోంది. ఈ చీరతో దిగిన ఫోటోలను ప్రియాంక నెట్టింట్టో పోస్ట్ చేసి సందడి చేసింది.

Priyanka Chopra : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భారతీయుల ఫేవరేట్ దేశీ గర్ల్. ఈ గ్లోబల్ ఐకాన్, రెడ్ కార్పెట్‌పైన అద్భుతమైన , ఆకర్షణీయమైన ప్రకాశవంతమైన ప్యాంట్ సూట్‌లను ధరించి అదరగొట్టడమే కాదు సింపుల్‌గా చీరకట్టుతోనూ ప్రకాశవంతంగా మెరవగలదు. నిజానికి ఈ బ్యూటీకి చీరలంటే చాలా ఇష్టం. చేనేత పట్టు చీరలు, డిజైనర్ డ్రేప్స్, షిఫాన్ వెరైటీల చీరలన్నీ ఈ అమ్మడి వార్డ్‌రోబ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా ఓ ఈవెంట్ కోసం ప్రియాంకా చోప్రా పసుపు రంగు షిఫాన్ చీరను కట్టుకుని లాస్ ఏంజిల్స్‌కు దేశీ గర్ల్ గ్లామర్ ను పరిచయం చేసింది. ఈ చీరకట్టుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అమ్మడి లుక్స్ చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. ఈ చీరకట్టు తో దిగిన వీడియో పోస్ట్ కింద శారీ శారీ నైట్స్ అని క్యాప్షన్‌ను జోడించింది ప్రియాంక చోప్రా.

సీక్విన్ అలంకరణలతో డిజైన్ చేసిన షిఫాన్ పసుపు రంగు చీరను ట్రెడిషనల్ స్టైల్‌లో కట్టుకుని పల్లూను భుజాల మీదుగా నేలను తాకేలా వదిలింది. ఈ చీరకు మ్యాచింగ్‌గా వైడ్ యూ నెక్‌లైన్, క్రాపెడ్ మిడ్‌రిఫ్ బేరింగ్ హెమ్ తో వచ్చిన స్లీవ్‌లెస్ బ్లౌస్‌ను వేసుకుంది. చేతికి గాజులు, బ్రేస్‌లెట్స్, స్లీక్ గడియారం పెట్టుకుంది. మెడలో ఆర్నేట్ చోకర్ నెక్‌లెస్‌ను అలంకరించుకుంది. పాదాలకు హైహీల్స్ వేసుకుని లాస్ ఏంజిల్స్ రోడ్లపైన వయ్యారంగా నడిచి అందరిని మంత్రముగ్ధులను చసింది. తన కురులను మధ్యపాపటి తీసి లూజ్‌గా వదులుకుంది. నుదుటన ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంది. పెదాలకు బెర్రీ టోన్డ్ లిప్ షేడ్ వేసుకుంది. కనులకు వింగెడ్ ఐ లైనర్, సబ్టిల్ ఐ ష్యాడో పెట్టుకుని తన అందచందాలతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

సౌత్ ఏషియన్ ఆస్కార్ నామినీస్ పదేళ్ల సెలబ్రేషన్స్‌కు ప్రియాంక నెట్టెడ్ బ్లాక్ శారీ కట్టుకుని కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. లేస్ ఎంబ్రాయిడరీ సీక్విన్ డీటైల్స్‌తో వచ్చిన ఈ చీరలో ఎంతో సెక్సీగా కనిపించింది ప్రియాంక. సంప్రదాయ పద్ధతిలో చీరకట్టుకుని దానికి మ్యాచింగ్‌గా స్లీవ్స్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లాస్ట్ ఇయర్ కర్వా చౌత్ వేడుకలకు ప్రియాంక చోప్రా ఫ్రిల్ డిజైన్స్‌తో వచ్చిన ఎరుపు రంగు చీర కట్టుకుని అందరిని అట్రాక్ట్ చేసింది. పండుగ అలంకరణలో ఈ భామ అందాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ రెడ్ కలర్ చీరకు కాంట్రాస్ట్‌గా వైట్ కలర్ స్లీవ్ లెస్ డీప్ నెక్‌లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని హీట్ పెంచింది. ఈ చీరకట్టుతో దిగిన ఫోటోలను ప్రియాంక నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.

అంతకు ముందు హోలీ సందర్భంగా వైట్ కలర్ పంజాబీ సూట్ వేసుకుని పరేషాన్ చేసింది ప్రియాంక. భర్త నిక్ కూడా సంప్రదాయ కుర్తా పైజామా వేసుకుని మెరిసిపోయాడు. ఈ పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
