నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతుందని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో మొదటి సారి చైతన్య పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. వెంకట్ ప్రభు గత చిత్రాల తరహాలోనే ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ మూవీ కాన్సెప్ట్ ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.
అయితే ఆమె పోషించేది పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో కోలీవుడ్ స్టార్స్ జీవా, అరవింద్ స్వామి కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడని మరో టాక్ కూడా ఉంది. ఇక చైతన్య, జీవా పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. తెలుగు, తమిళ్ బాషలలో తెరకెక్కుతున్న నేపధ్యంలో అన్నిచోట్ల ప్రేక్షకులకి రీచ్ కావడానికి కాస్టింగ్ ని కూడా వెంకట్ ప్రభు అలాగే ఫైనల్ చేసినట్లు టాక్.
నాగ చైతన్య కెరియర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. అలాగే కృతి శెట్టికి వరుస మూడు ఫ్లాప్ ల తర్వాత వస్తున్న సినిమా కావడం చాలా కీలకంగా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దూత అనే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.