అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాని బాలకృష్ణతో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల ద్వారా ఆడియన్స్ కోరుకునే ఫన్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయని ఇప్పటికే చెప్పాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా కంప్లీట్ కావడంతో అనిల్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ నుంచి ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం కామెడీ జోనర్ సినిమాలని చూసాం.
పైసా వసూల్ సినిమాలో కామెడీ కంటెంట్ ఉన్న కూడా పూరి క్యారెక్టరైజేషన్ కారణంగా అది ఎక్కువగా రీచ్ కాలేదు. ఈ నేపధ్యంలో అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణని సరికొత్తగా చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తుంది. మూవీలో బాలకృష్ణ భార్య పాత్రలో ప్రియమణి నటించబోతుంది. నయనతార, శ్రియ లాంటి హీరోయిన్స్ పేర్లు వినిపించిన ఫైనల్ గా అనిల్ రావిపూడి ప్రియమణికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
ప్రియమణి గతంలో మిత్రుడు అనే సినిమాలో బాలకృష్ణకి జోడీగా నటించింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి బాలకృష్ణ భార్యగా నటిస్తూ ఉండగా వారి కూతురుగా శ్రీలీల కనిపించబోతుంది. ఇక తండ్రి, కూతుళ్ళ మధ్య నడిచే కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. దిల్ రాజు, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక అనిల్ రావిపూడి ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫైనల్ చేసాడని, త్వరలో ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్.