సినిమా వాళ్లకు సంబంధించిన విషయాల గురించి ఏదైనా వార్త వస్తే చాలు అది మంచా చెడా అని ఆలోచించకుండా వైరల్ చేసేస్తూ ఉంటారు.అది తప్పు అని తెలిసినప్పుడు కనీసం అలాంటి ప్రచారం చేసినందుకు సారీ అని కూడా చెప్పరు.అందరూ సినిమా వాళ్ళ జీవితాలను ఓపెన్ బుక్ లా భావిస్తారు అందుకే వాళ్ళ జీవితాలలో జరిగిన అంశాలపై వాళ్ళకి నచ్చినట్టు కామెంట్స్ చేసేస్తుంటారు ఈ విషయంపై సీనియర్స్ ఎన్నోసార్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు కానీ వీటిని పట్టించుకునే వారు ఎవరు లేరు అందుకే సినిమా వాళ్ళపై వాళ్ళ జీవితాలపై ఇలాంటి రూమర్స్ ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఈటీవిలో మల్లెమాల యాజమాన్యం వారు నిర్మిస్తున్న డ్యాన్స్ షో ఢీలో మరియు స్పెషల్ ఈవెంట్స్ లో బ్యాక్ టు బ్యాక్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియమణికి సంబంధించి గత కొంతకాలంగా ఆమె భర్త ముస్తాఫా రాజ్ విడిపోతున్నారని త్వరలో విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.ఈ రూమర్స్ పై ప్రియమణి మౌనం వహించడంతో ఈ రూమర్ నిజమనే ప్రచారం ఎక్కువైంది.దీంతో వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న ప్రియమణి తాజాగా దీపావళి సందర్భంగా తను తన భర్త ముస్తాఫా రాజ్ తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.దీంతో విడాకుల పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్టు అయ్యింది.