Priya Warrior: సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం, ఆ తర్వాత పాపులారిటీని సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ కొంతమందికి మాత్రం పాపులారిటీ అనుకోకుండా కలిసి వస్తుంది. దాంతో వారు రాత్రికి రాత్రే పెద్ద స్టార్లు అయిపోతుంటారు. ఇలా ఒక్క వీడియో క్లిప్ ద్వారా ఫేమస్ అయిన హీరోయిన్ ప్రియా వారియర్.
మలయాళంలో ఓ సినిమాలోని ఓ చిన్న క్లిప్ ప్రియా వారియర్ ను పెద్ద హీరోయిన్ ను చేసింది. అమ్మడికి రాత్రికి రాత్రే పాపులారిటీని తెచ్చిన ఆ వీడియోతో ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంది. అయితే తాజాగా ప్రియా వారియర్ కు చెందిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ అవుతోంది. అందులో బెడ్ మీద ప్రియా వారియర్ చేసిన రొమాన్స్ కుర్రకారులో హీట్ పుట్టిస్తోంది.
రంజన్ అనే వ్యక్తితో హీరోయిన్ ప్రియా వారియర్ బెడ్ రూంలో చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రియా, రంజన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని, అమ్మడు అందాలతో హీట్ పుట్టించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెల్ల డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్ల మతిపోగొట్టేలా ప్రియా వారియర్ వీడియోలో కనిపించింది.
Priya Warrior:
ఇక ప్రియా వారియర్ తెలుగులో ఇష్క్, చెక్ సినిమాలు చేసినా ఇవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. హీరోయిన్ ప్రియా వారియర్ ప్రస్తుతం విష్ణుప్రియ అనే కన్నడ సినిమాతో పాటు హిందీలో శ్రీదేవి బంగ్లా, యారియాన్2, త్రీమంకీస్, లవ్ హ్యాకర్స్ అనే సినిమా చేస్తోంది. సినిమాలతో పాటు ఫోటో షూట్ లతో అమ్మడు ఎప్పుడూ బిజీగా ఉంటోంది.
View this post on Instagram