Priya Prakash Varrier: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం ఈమె మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మలయాళ చిత్రం అయినా ఒరు అధార్ లవ్ విమానం తెలుగులో లవర్స్ సినిమాగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో ఒక్కసారిగా ఊహించిన విధంగా దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈమెను ముద్దుగా అభిమానులు కన్ను గీటు బొమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే వింక్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈమె తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. అలాగే యంగ్ హీరో తేజా సజ్జ సరసన ఇష్క్: నాటి లవ్ స్టోరీ సినిమాలో నటించి మెప్పించింది. ఈ రెండు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
కాగా ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో అరటిజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు టాలీవుడ్,కోలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోని ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సినిమాల పరంగా బిజీబిజీగా ఉంటూనే మరొకవైపు వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది ఈ వింక్ బ్యూటీ.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో యువతకి సెగలు పుట్టిస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో తడిచిన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.