వెండి తెర మీద అమ్మగా,అత్తగా అందరినీ అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె హౌస్ లో సన్నీతో గొడవ కారణంగా బిగ్ బాస్ వీక్షకులకి పెద్ద తలనొప్పిగా మారింది.దీంతో ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.అయితే తాజాగా ప్రియకు వరుసకు కూతురు అయిన లోహిత వివాహం హైదరాబాద్ లో జరిగింది.ఈ వేడుకకు ప్రియ హౌస్ లో తన తోటి కంటెస్టెంట్ లయినా ఉమాదేవి, సరయు, జస్వంత్ లను ప్రత్యేకంగా ఆహ్వానించారు.ప్రియ ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హాజరయ్యారు.వీరితో ఫోటోలు దిగడానికి పెళ్ళిలో పాల్గొన్నవారు ఎగబడ్డారు.బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఈ వివాహ వేడుకలో పాల్గొనడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వేడుక స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
మొదటివారమే హౌస్ నుండి సరయు ఎలిమినేట్ కాగా, ఉమాదేవి రెండవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక అనారోగ్యం కారణంగా పదవ వారం జెస్సి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.గతంలో హౌస్ మేట్స్ లాగే ఈ సీజన్ హౌస్ మేట్స్ కూడా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటూ పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొంటుండడం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.