గాడ్ ఫాదర్ సినిమాతో పవర్ ఫుల్ విలన్ రోల్ లో సత్యదేవ్ మరోసారి తన మాసివ్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. అందరి అంచనాలు మించిపోయే విధంగా సత్యదేవ్ చిరంజీవి నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతమైన విలనిజం పండించారు. ఇక హీరోగా కూడా తనకి ఇష్టమైన కథలని ఎంపిక చేసుకుంటూ సత్యదేవ్ దూసుకుపోతున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కన్నడ స్టార్ ధనుంజయ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇతను పుష్ప సినిమాలో జాలీరెడ్డి పాత్రలో మెరిశాడు.
ఇక వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ గా ఇంటరెస్టింగ్ కంటెంట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో తమిళ్ హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే తమిళ్ లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పిస్తున్న ప్రియా భవాని శంకర్ లీడ్ రోల్ కోసం కన్ఫర్మ్ అయ్యింది. తాజా గా చిత్ర యూనిట్ పోస్టర్ తో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఈ బ్యూటీ ధనుష్ డబ్బింగ్ మూవీ తిరుతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. ఇదిలా ఉంటే సత్యదేవ్ హిందీ డెబ్యూ మూవీ రామ్ సేతు రిలీజ్ కి రెడీ అవుతుంది.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అలాగే తమన్నాతో కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే కృష్ణమ్మ అనే సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ మీద కూడా పాజిటివ్ బజ్ ఉంది. అలాగే బ్లఫ్ మాస్టర్ కి సీక్వెల్ కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో సత్యదేవ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. గాడ్ ఫాదర్ సక్సెస్ తో ఇప్పుడు విలన్ రోల్స్ కూడా అతనికి వస్తున్నట్లు తెలుస్తుంది.