Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతను సెంచరీ చేసి ఔరా అనిపించాడు. మొత్తంగా అతని టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. ఇంతకముందు 18 అర్ధ సెంచరీలు చేశాడు. ఒకసారి 99 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం అలా కాకుండా కేవలం 46 బంతుల్లోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 61 బంతుల్లో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ విధంగా బీసీసీఐకు తన సత్తా ఏంటో తెలియజేశాడు. పృథ్వీ అజేయ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ముంబై 230 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టాస్ గెలిచిన అస్సాం జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అమన్‌ఖాన్ కేవలం 15 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో పృథ్వీ షా మరో యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌తో సెంచరీ భాగస్వమ్యం నమోదు చేసి ముంబైకి భారీ స్కోరు అందించాడు. అయితే 30 బంతుల్లో 42 పరుగులు చేసిన యశస్వి ఔటయ్యాడు. ఆఖర్లో సర్ఫరాజ్‌ఖాన్ 15, శివమ్ దూబే 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
మొదటి మ్యాచ్‌లో 55 పరుగులు
ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ నెల 11న ప్రారంభమైంది. మిజోరామ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా పృథ్వీషా 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 34 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఈ స్కోర్ సాధించాడు. రెండో మ్యాచ్‌లో కూడా ఎంపీపై 29 పరుగులు చేసాడు. దీంతో ఇటీవల పరోక్షంగా బీసీసీఐపై సెటైర్లు వేసిన ఈ యువ క్రికెటర్ ఈసారి బ్యాట్‌తో బీసీసీఐకి తన సత్తా తెలిపాడు.
Prithvi Shaw:
ఇండియా-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపికచేసిన జట్టులో తమ పేరు లేకపోవడంతో బాధపడ్డ పృథ్వీషా వారి మాటల్ని ఎవరూ నమ్మవద్దు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోరు అంటూ పరోక్షంగా బీసీసీఐని విమర్శించాడు. ఈ మ్యాచ్‌కు పృథ్వీ 84 టీ20 మ్యాచ్‌లు ఆడి 26 సగటుతో 2153 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 149 భారీ స్ట్రైక్ రైట్ ఈ ఆటగాడికి బలం. అంతేకాకుండా ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా ఇతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.