దీపావళి కానుకగా పెద్ద సినిమాలు పోటీలో లేకపోయిన మినిమమ్ రేంజ్ సినిమాలు అయితే థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా ఒకటి కాగా శివ కార్తికేయన్ మొదటి సారి తెలుగులో నటిస్తున్న ప్రిన్స్ మూవీ ఒకటి. ఈ మూవీకి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకుడు అనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించింది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు కూడా కామెడీ అండ్ ఎంటర్టైనర్ చిత్రాలుగానే ప్రేక్షకుల ముందుకి అక్టోబర్ 21న రాబోతున్నాయి.
శివ కార్తికేయన్ కి అటు తమిళ్ లో, ఇటు తెలుగులో కూడా ఈ సినిమా చాలా కీలకం. అతని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతని గత చిత్రాల కారణంగా ప్రిన్స్ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ కూడా బాగానే హిట్ అయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీని అనుదీప్ ఆవిష్కరించాడు. ఇక జిన్నా మూవీతో కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అయితే కథ మాత్రం కోన వెంకట్ అందించింది కావడం విశేషం.
హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుంది. చాలా రోజులుగా మంచు విష్ణుకి సాలిడ్ హిట్ లేదు. ఈ నేపధ్యంలో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని తనకి అలవాటైన కామెడీ జోనర్ ని ఎంచుకున్నారు. దీని మీద కూడా కొంత పాజిటివ్ బజ్ అయితే ఉంది. మరి ఈ రెండు చిత్రాలలో దీపావళి విన్నర్ ఎవరనేది మాత్రం ప్రేక్షకుల అంచనాకి వదిలేయాలి. రెండు చిత్రాలు కామెడీని నమ్ముకొని ప్రేక్షకులని పలకరించబోతున్న నేపధ్యంలో ఎవరికి ఆడియన్స్ సపోర్ట్ దొరుకుతుంది అనేది చూడాలి.