Prince Trailer: శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రిన్స్. అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. అతను తీసిన సినిమా కంటే అతను ఇచ్చిన ఇంటర్వూలతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. ఏ ప్రశ్న అడిగినా తిన్నగా మాత్రం సమాధానం చెప్పడు. అలా హీరోల కంటే ఎక్కువ మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్ ఈ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు.
ఇక తన సినిమాలలో కామెడీ తప్ప మరేమి ఆశించలేం. ఇది వరకే జాతి రత్నాలు సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కథతో సంబంధం లేకుండా కేవలం కామెడీ తో సినిమా మొత్తం నడిపించి హిట్ అందుకున్నాడు. తీసింది ఒక చిత్రమే అయినా తను ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిగా జాతిరత్నాలుతో విజయం అందుకున్నాడు. ఇక తన తర్వాతి చిత్రం శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమాని తెరకెక్కించబోతున్నాడు.
ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అనుదీప్ కేవీ తనదైన స్టయిల్లో సినిమాని రూపొందించినట్టుగా ట్రైలర్ ని చూస్తుంటే అర్ధమవుతుంది. ఒక వైవిధ్యమైన కథలా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రేమకి కులం మతం ప్రాంతం అనే తేడా లేదని చెప్తూనే ఆ కథతో పాటే కామెడీ ని తీసుకొస్తున్నట్టుగా ట్రైలర్ ని చుస్తే ఆర్డమవుతోంది. తన మార్క్ కామెడీని మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నాడు.
Prince Trailer:
ఇప్పటికే సినిమా ఆలస్యం అయిందనే టాక్ నడుస్తోంది. తనకు ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చూడాలి మరి జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఈ సారి ఎలా ఆకట్టుకుంటాడో.