శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ ప్రిన్స్. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు, తమిళ్ బాషలలో ఏక కాలంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకి బాగా చెరువ అయ్యింది. ఇంగ్లీష్ అమ్మాయిని ప్రేమించి తెలుగు అబ్బాయి కథగా దీనిని అనుదీప్ ఆవిష్కరించాడు. బాష రాకపోవడంతో ప్రేమించిన అమ్మాయిని లైన్ లో పెట్టడానికి అతను పడే పాట్లు, ఆపై కుటుంబం కట్టుబాట్లు అంటూ గ్రామంలో పెట్టె పంచాయితీల నేపధ్యంలో ఈ సినిమా కథనం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఆవిష్కరించే ప్రయత్నం అనుదీప్ కెవి చేసాడు. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల అందరిని బాగా నవ్వించిన అనుదీప్ ఈ సినిమాని తనకి అలవాటైన కామెడీనే నమ్ముకొని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది.
శివ కార్తికేయన్, కట్టప్ప సత్యరాజ్ కాంబినేషన్ ఈ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయ్యిందని ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాట. వాళ్ళ కామెడీ టైమింగ్, అనుదీప్ స్టైల్ కామెడీ నేరేషన్ ఆధ్యాంతం ప్రేక్షకులతో నవ్వులు పూయించింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఇరికించినట్లు ఉన్నా కూడా ఓవరాల్ గా శివకార్తికేయన్ తన కామెడీ టైమింగ్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి వెండితెరపై మెస్మరైజ్ చేసాడని ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. అలాగే హీరోయిన్ గా నటించిన ఉక్రెయిన్ అమ్మాయి కూడా అందంగా కనిపిస్తూ మెప్పించే ప్రయత్నం చేసింది. ఆమె చుట్టూ అల్లుకున్న బట్లర్ ఇంగ్లీష్ కామెడీ బాగా పండింది అని తెలుస్తుంది. కాలేజీలో ఇంగ్లీష్ రాకపోయిన మాట్లాడటానికి ట్రై చేసే కొంత మంది తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసి టింగ్లీష్ మాట్లాడుతారు.
అలాగే ఈ సినిమాలో శివ కార్తికేయన్ పాత్ర ఉంటుంది. ఇక సింగిల్ లైన్ కామెడీ డైలాగ్స్ సినిమాలో చాలా చోట్ల పేలాయి. అనుదీప్ కామెడీ టైమింగ్ ని సెలబ్రెటీలు కూడా ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక తమన్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పెర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయ్యింది. దీపావళికి కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ చిత్రంగా ప్రిన్స్ ఉందని ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఓవరాల్ గా శివ కార్తికేయన్ కి ప్రిన్స్ మూవీతో హ్యాట్రిక్ హిట్ వచ్చిందని తమిళనాట వినిపిస్తుంది. అలాగే స్ట్రైట్ తెలుగులో కూడా మొదటి హిట్ ని శివ కార్తికేయన్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. ప్రిన్స్ మూవీ తర్వాత తెలుగులో కూడా శివ కార్తికేయన్ బ్రాండ్ ఇమేజ్, నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని పబ్లిక్ టాక్.