శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ప్రిన్స్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ కి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే ప్రిన్స్ నుంచి వచ్చిన రెండు పాటలకి మంచి స్పందన వచ్చింది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని అనుదీప్ తెరకెక్కించారు. ఇంగ్లీష్ రాని కుర్రాడు ఫారిన్ అమ్మాయిని ప్రేమిస్తే అతని కష్టాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ తో అనుదీప్ ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని రీసెంట్ గా కన్ఫర్మ్ కాలేదు. అయితే అక్టోబర్ 21న దీపావళి సందర్భంగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఏకంగా శివ కార్తికేయన్ కెరియర్ లో హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఏకంగా వందకోట్ల బిజినెస్ ఈ సినిమాకి జరిగిందని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఒక మినిమమ్ రేంజ్ హీరోకి ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అంటే చిన్న విషయం కాదు.
దానికి కారణం తమిళంలో శివ కార్తికేయన్ కి ఉన్న మార్కెట్ ఒకటి అయితే జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ సంపాదించుకున్న క్రేజ్ కూడా ప్రిన్స్ బిజినెస్ ఈ స్థాయిలో జరగడానికి కారణం అయ్యిందనే మాట వినిపిస్తుంది. అక్టోబర్ 10 నుంచి ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ మూవీని సురేష్ బాబు నిర్మించారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ అంటే వారి మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.