గతంలో ప్రశాంత్ వర్మ,తేజా సజ్జా కలిసి చేసిన జాంబీ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 శాతం ఆక్యుపెన్సీ రూల్ సమయంలో విడులయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యింది.ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెలుగులో హను – మాన్ అనే సూపర్ హీరో మూవీ రాబోతుంది.ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ మూవీ 2022 సమ్మర్ విడుదలకి తీసుకొని రావాలనే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.
ఈ సూపర్ హీరో మూవీ కోసం చిత్ర యూనిట్ భారీ వి.ఎఫ్.ఎక్స్ పనిలో నిమగ్నమైంది.ఈ మూవీకి నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.వినూత్నమైన కథలతో సినీ అభిమానులను ఆకట్టుకునే ప్రశాంత్ వర్మ ఈ మూవీతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయగలరా లేదా అనేది వేచి చూడాలి.