యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ షెడ్యుల్స్ మధ్య గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటూ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సలార్ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక నెక్స్ట్ షెడ్యుల్ కోసం ప్రశాంత్ నీల్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 11 భారీ సెట్స్ ని డిజైన్ చేయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సెట్స్ కోసమే కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలని ఈ సెట్స్ లో చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రాజెక్ట్ కె షెడ్యుల్ పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణం రాజు అనారోగ్య సమస్యల కారణంగా సలార్ షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఇంతలో అతని మరణం కూడా ప్రభాస్ ని మానసికంగా కొంత కృంగదీసింది. దాంతో పాటు కృష్ణంరాజు దినకర్మలు కూడా ఉన్నాయి. వీటన్నింటి కారణంగా సలార్ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కావడం ఆలస్యం అవుతుంది. ఇప్పటికే సలార్ నెక్స్ట్ షెడ్యుల్ కోసం ప్రశాంత్ నీల్ డేట్ ఫిక్స్ చేసుకున్న కృష్ణంరాజు మృతి కారణంగా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది.
అయితే ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యుల్ లో మెజారిటీ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ లుక్ పై అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినిపించింది. అయితే అలాంటిదేం లేదని చిత్ర యూనిట్ నుంచి వినిప్పిస్తున్న మాట. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా ఓ వైపు షూటింగ్ చేస్తూనే దర్శకుడు కంటెంట్ కి విజువల్ ఎఫెక్ట్స్ కి పంపించేస్తున్నారని తెలుస్తుంది. ఫ్యూచర్ జెనరేషన్ స్టొరీ కావడంతో ఎ మాత్రం లూప్ దొరకకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నాగ్ అశ్విన్ షూటింగ్ నుంచి అన్ని అంశాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.