Biggboss 6 : అబ్బబ్బో ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి మామూలు నటులు వెళ్లలేదుగా.. ఒక్కొక్కరిది ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్. అసలు ఇలాంటి వాళ్లే కదా.. బిగ్‌బాస్ హౌస్‌కు కావల్సింది. ఇక గలాటా గీతూ తొలి రోజు నుంచే పెర్ఫార్మెన్స్ ప్రారంభిస్తే.. ఆ తరువాత ఒక్కొక్కరుగా చెలరేగిపోతున్నారు. మరికొందరు మాత్రం హైస్‌లో ఉన్నామా? లేమా? అన్నట్టుగా ఉన్నారు. ఇక సింగర్ రేవంత్.. అతనికైతే మాస్క్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అతను చేస్తున్నదంతా పర్ఫెక్ట్ అయినా కూడా సీరియస్‌గా చెబుతుండటంతో ఎవరికీ పెద్దగా నచ్చట్లేదు. ఇక హౌస్‌లోకి దంపతులైన మెరీనా-రోహిత్ జంట అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక నిన్న మెరీనా పెర్ఫార్మెన్స్ పీక్స్ అనే చెప్పాలి.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆరోహి తనను బాడీ షేమింగ్ చేసిందని కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పింది మెరీనా. నిన్న మాత్రం నిజానిజాలేంటో ఆరా తీసిన తర్వాత తన మాటను వెనక్కు తీసుకుంది. తను మాట్లాడినదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అందరి ముందు క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత జరిగిన డ్రామా అంతా ఇంతా కాదు. మెరీనా నానా రచ్చ చేసింది. తన భర్తతో తానేదో మాట్లాడదాం అనుకుంటే మధ్యలో శ్రీ సత్య వచ్చిందని ఆమెకేం అవసరమని రచ్చ రచ్చ చేసింది. చేయాల్సిందంతా చేశాక తూచ్ ఇదంతా ప్రాంక్ అనేసింది. అయితే అప్పటికే అక్కడున్న వారికి అర్థమైందనుకోండి.
Biggboss 6 : ప్రాంకో లేదంటే మనసులో మాటో..
భార్యాభర్తలైన మెరీనా-రోహిత్ ఎప్పటిలాగే గొడవపడ్డారు. రోహిత్ తనతో కాసేపు వాకింగ్ చేయమంటే పట్టించుకోకుండా శ్రీ సత్యతో వెళ్లిపోయాడంటూ గొడవకు దిగింది మెరీనా. నా భర్తతో నేను వాకింగ్ చేయొద్దా అంటూ రాద్ధాంతం చేసి రచ్చ చేసి ఏడ్చింది. నీ భర్త నీతో రాకుంటే నాదా తప్పు అని శ్రీ సత్య అనడంతో మెరీనా మరింత రెచ్చిపోయింది. మొత్తానికి నానా రచ్చ చేసి చివరకు ఇదంతా ప్రాంక్ అనేసింది. నిజంగా ప్రాంకో లేదంటే మనసులో మాటో తెలియదు కానీ మొత్తానికి నాటకం అని చెప్పి ముగించేసింది. కానీ అప్పటికే అదంతా నాటకం అని మిగతా హౌస్‌మేట్స్‌కు అర్థమవడంతో ఆ ప్రాంక్ అంతా వేస్ట్ అయిపోయింది.