Praniti: ప్రణీత కన్నడ, తమిళ్, తెలుగు భాషలలోని అనేక సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ప్రణీత 17 అక్టోబర్ 1992న బెంగుళూరులో జన్మించింది.ఈమె 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో దర్శకత్వం వహించిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో, ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. పోర్కి హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ (2010) సినిమా తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రణీత కు అప్పటినుంచి స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చింది.ఆ తర్వాత ఈమె నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా ఈమెకు నటనలో మంచి పేరును తెచ్చింది. 2012 లో ఆమె నటించిన సినిమా భీమ తీరలదల్లై సినిమాకి ఈమె నటనకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్లో ఉత్తమ నటి-కన్నడగా, సీమా అవార్డుకు కన్నడ భాషలో ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయింది.
సెలబ్రిటీలు అన్నాక వారు ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ గా ఉంటుంది. కొన్నిసార్లు అవార్డు ఫంక్షన్లకు, షోలకు హీరోయిన్లు వెరైటీగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి వస్తూ ఉంటారు. అలా వచ్చి చాలా ఫంక్షన్స్ లలో ఇబ్బంది పడ్డ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇదేవిధంగా హీరోయిన్ ప్రణీత కూడా తన డ్రెస్సులు సర్దుకుంటూ కారులో నుంచి దిగుతూ తన మొబైల్ ను క్రింద పారేసుకుంది.ఇక ఇటీవల అమ్మడు పింక్ కలర్ లో హెవీ డ్రెస్ ధరించి క్రేజీ వీడియోతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
Pranitha: ప్రణీత కొంప ముంచిన డ్రస్సు..
సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ప్రణీత కారులో ఉన్నంతసేపు తన మొబైల్ ను ఒళ్ళో పెట్టుకొని ఉండేదని తెలుస్తోంది. అలాగే తన డ్రెస్ మీద పెట్టిన శ్రద్ధ వల్ల మొబైల్ ఫోన్ తన ఒళ్ళు ఉన్నట్లు మర్చిపోయి అట్లే కారు దిగేసింది. ఆ దిగిన వెంటనే కారు దిగిన వెంటనే మొబైల్ ఒళ్ళు లో నుంచి కింద పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తన డ్రెస్సే తన ఫోన్ కింద పడిపోవడానికి కారణమైందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.