Pranita Subhash: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలామందికి ప్రణీత పేరు వినగానే ముందుగా అత్తారింటికి దారేది సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. అంతకుముందు ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాతో భారీగా పాపులాటిని సంపాదించుకుంది ప్రణీత సుభాష్.
ఆ సినిమాలో తన అందం అభినయంతో నటనతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే మొదట ఈమె ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా తోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రణీత సుభాష్.
ఈమె నటించిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆమెకి ఉన్న పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ప్రణీత సుభాష్ తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
ఇకపోతే ప్రణీత సుభాష్ కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమందికి తన చేతులతో వంట చేసి మరి అన్నదానం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె రియల్ లైఫ్ లో హీరోయిన్ గా నిలిచింది. కరోనా మహమ్మారి మరోవైపు విజృంభిస్తున్న ఏమాత్రం భయపడకుండా ఎంతోమందికి అండగా నిలుస్తూ అన్నదానం చేసి ఎంతోమంది కడుపు ఆకలిని తీర్చింది.
ఇక ఇది ఇలా ఉంటే కరోనాలో ఈమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎవరికీ చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కారణాన్ని కూడా వివరించింది. ఇలా ఉంటే ఇటీవలే ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన క్యూట్ బేబీ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె తన కూతురిని ఎత్తుకొని ముద్దాడుతోంది. ఆ ఫోటోలో ఆ పాప ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ప్రణీత అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.