ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మద్దతు ఉంటే చాలు వాళ్లకు అవకాశాలకు డోకా ఉండదు అలాంటి మెగా ఫ్యామిలీ మద్దతు పొందిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు చేతిలో మా ఎన్నికలలో పరాభవం పొందారు.దీంతో అసలు ప్రకాష్ రాజ్ మా ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారు అనే అంశంపై పెద్ద ఎత్తున ఫిల్మ్ సర్కిల్స్ చర్చ జరుగుతుంది.
ఈ చర్చల ప్రకారం మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను పరిచయం చేసే సమావేశంలో అప్పటి మా అధ్యక్షుడు నరేష్ పై విమర్శలు గుప్పించారు.దీంతో అప్పటివరకు తన పని తాను చూసుకుంటున్న నరేష్ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు హార్ట్ అయ్యి ఎలాగైనా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు.అందుకే ఆయన మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతు పలికారు.
నాగబాబు అండ చూసుకొని రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ మరియు తదితరులు మంచు ఫ్యామిలీని పర్సనల్ గా టార్గెట్ చేశారు.దీంతో ప్రకాష్ రాజ్ పై వ్యతిరేకత ఎక్కువ అవుతూ వచ్చింది.దీన్ని గమనించి రంగంలోకి దిగిన నాగబాబు ఉన్న పరిస్థితులను చక్కబెట్టడం మానేసి మంచు విష్ణును పర్సనల్ గా టార్గెట్ చేసి ప్రకాష్ రాజ్ ను ఎత్తివేయడం కోటా లాంటి సీనియర్ ను టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి ప్రకాష్ రాజ్ కు బాగా నెగెటివిటిని పెంచేశాయి.
ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మంచు ప్యానెల్ సీనియర్ లను,సినీ పెద్దలను రంగంలోకి దింపి మనల్ని మనం పాలించుకొలేమా అంటూ ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టి ఎన్నికల టైడ్ ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు.