Pragya Jaiswal: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం,జయ జానకి నాయక,ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి సినిమాలలో నటించింది. అయితే తెలుగులో ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కలేదు.
దీంతో కొద్దిరోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు హీరోయిన్ ప్రగ్యా కి కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఈ సినిమా విడుదల తర్వాత ఆమె పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే సినిమా అఖండ. సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కూడా తగ్గడం లేదు.
సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటో లను షేర్ చేస్తూనే ఉంది.అంతేకాకుండా అఖండ సినిమా తర్వాత ఈమె తన అందం విషయంలో మరింత డోస్ ని పెంచేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో గ్రీన్ కలర్ సారీ లో మెరిసిపోతోంది. అందులో తన చీర కొంగుని పక్కకు జరిపి ఎద అందాలు నడుము అందాలను చూపిస్తూ రకరకాలుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.