Pragya Jaiswal : ప్రగ్య జైస్వాల్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందం తో నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన చిన్నది ఈ బ్యూటీ. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి నాటిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతోంది. 2014 లో తమిళ సినిమా విరాట్టు తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది ప్రగ్య.

ఈ అమ్మడి నటన నచ్చి తెలుగు చిత్రంలో అవకాశం ఇచ్చారు. 2015 లో వారుంటేజ్ సినిమా కంచె లో కనిపించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ అవార్డు ను గెలుచుకుంది.

కంచె సినిమా హిట్ తర్వాత ప్రగ్య కు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. గుంటూరోడు , నక్షత్రం, జయ జానకి నాయక , ఆచారి అమెరికా యాత్ర , అఖండ , సన్ అఫ్ ఇండియా వంటి సినిమాల్లో నటించింది. ఇందులో అఖండ మినహా అన్ని సినిమాలు సో సో గానే ఆడాయి అని చెప్పాలి. హిందీ లో అదృష్టం పరీక్షించుకున్నా పెద్దగా వర్కౌట్ కాలేదు.

దీనితో చాన్నాళ్ల తర్వాత ప్రగ్య జైస్వాల్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రగ్య జైస్వాల్ ఈ ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ లైకులు , కోమెంట్ లు పోస్ట్ చేస్తున్నారు.

ఇన్ డోర్ లో చేసిన తాజా ఫోటో షూట్ కోసం ప్రగ్య జైస్వాల్ వరుణ్ చక్కిలం ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ అందమైన లెహంగా సెట్ ను ఎన్నుకుంది. ఈ ట్రెడిషనల్ వేర్ కు తగ్గట్లుగా జ్యువలరీని హియ జెవెల్లెర్స్ నుంచి ఎన్నుకుంది. ఫుట్వేర్ ను రెపోర్ట్ షూస్ నుంచి ఎన్నుకుంది. దీపికా కర్ణని మాకెవర్స్ ప్రగ్య జైస్వాల్ అందానికి మెరుగులు దిద్దారు. ఫ్యాషన్ స్టైలిస్ట్ అనాహిత ప్రగ్య జైస్వాల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది.
