ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ మూవీలో శృతి హాసన్ ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ్ నాడార్ అనే పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. అతని తండ్రి పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఇక వారికి సంబందించిన స్టిల్స్ ఇప్పటికే వచ్చి మంచి బజ్ క్రియేట్ చేశాయి. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో పవర్ ఫుల్ ప్యాక్ మూవీగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఈ సినిమాని కంప్లీట్ డార్క్ మోడ్ లోనే చిత్రీకరిస్తున్నారు. అందరి కాస్ట్యూమ్స్ ఈ మూవీలో ఒకే విధంగా ఉండబోతున్నాయని ఫస్ట్ లుక్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ యూనిట్ అతనికి సర్ప్రైజ్ గా విషెస్ చేసింది. సినిమా నుంచి ఎలాంటి పోస్టర్స్ ని రిలీజ్ చేయలేదు. అయితే సలార్ సినిమాలోని ప్రభాస్ వర్కింగ్ స్టిల్స్ ని విడిచిపెట్టారు. ఈ స్టిల్స్ లో బట్టలపై గ్రీజ్ మరకలతో మురికిపట్టి ఉన్నట్లు అతని లుక్ ఉంది.
దీనిని బట్టి సలార్ మూవీ కోసం ప్రభాస్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అర్ధమవుతుంది. సింగరేణి మైనింగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తుందని టాక్. గ్యాంగ్ స్టార్ గా మొదలైన సలార్ మాఫియా కింగ్ గా ఎలా మారాడు అనేది ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇక సలార్ వర్కింగ్ స్టిల్స్ ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఆదిపురుష్ నుంచి రాముడి లుక్, అలాగే ప్రాజెక్ట్ కె నుంచి సూపర్ హీరో ఎలివేషన్ లుక్, సలార్ నుంచి వర్కింగ్ స్టైల్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారని అర్ధమవుతుంది.