బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.రాధే శ్యామ్ మూవీతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ తన తదుపరి మూవీ షూటింగ్స్ లో బాగా బిజీగా ఉన్నారు.అర్జున్ రెడ్డి మూవీతో యావత్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నారు.తాజాగా ఈ మూవీ కోసం ప్రభాస్ 140 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ ఇది నిజమైతే సౌత్ ఇండియాలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోగా ప్రభాస్ నిలుస్తాడు.మరి ఇందులో నిజమెంతో తెలియాల్సివుంది