ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ వచ్చే ఏడాది చివరిలో కానీ లేదా 2023 మొదట్లో కానీ అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ మూవీ గురించి తాజాగా ఒక రూమర్ బాలీవుడ్ సర్కిల్స్ చక్కెర్లు కొడుతుంది.
దాని ప్రకారం ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ మూవీకి ప్రభాస్ దాదాపు 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట ఒకవేళ ఇది నిజమైతే భారత సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాక్టర్ గా ప్రభాస్ రికార్డు నమోదు చేస్తారు.