జిల్ ఫేం రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న మూవీ రాధేశ్యామ్.ఈ మూవీ వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్నది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.ఈ ఈవెంట్ కు అభిమానులే చీఫ్ గెస్ట్ లని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ను అభిమానుల చేత విడుదల చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.
సాధారణంగా తెలుగు మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు సుమ హోస్ట్ గా వ్యవహరిస్తుంది.కానీ ఈ ఈవెంట్ ను రెగ్యులర్ ఈవెంట్ లా చేయకూడదని భావించిన చిత్ర యూనిట్ హోస్ట్ బాధ్యతను యువ హీరో నవీన్ పోలిశెట్టికి అప్పగించారట.ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నవీన్ పోలిశెట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ ప్రచారం జరుగుతుంది.