కొంత మంది హీరోలని చూస్తే కమిట్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ అనిపిస్తారు. ఒక సినిమా అంటే వందల మంది కష్టం ఉంటుంది. నిర్మాత కోట్ల రూపాయిల వ్యయం ఉంటుంది. హీరోలు ఒక్క రోజు సినిమాకి డుమ్మా కొడితే నిర్మాతకి లక్షల్లో నష్టం వస్తుంది. అయితే కొంత మంది హీరోలు నిర్మాతల కష్టాన్ని, నష్టాన్ని అస్సలు పట్టించుకోరు. అయితే కొంత మంది హీరోలు మాత్రం కష్టంలో ఉన్నా కూడా నిర్మాత శ్రేయస్సు. వందల మంది తన కోసం వెయిట్ చేస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఇలాంటి వారి జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడని చెప్పాలి. సినిమా కోసం ఎలాంటి కష్టమైన పేస్ చేయడానికి అతను రెడీగా ఉంటాడు.
ఒక్కసారి దర్శకుడిని నమ్మితే అతను ఎలా చెబితే అలా చేస్తారు. స్టార్ దర్శకుడు, యంగ్ డైరెక్టర్ అనే తేడా ఏనాడూ కూడా ప్రభాస్ చూపించరు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు ప్రభాస్ గురించి గొప్పగా చెబుతారు. అలాగే సినిమా విషయంలో ఆయన కమిట్మెంట్ కూడా గొప్పగా ఉంటుందని చెబుతారు. ఈ విషయం తాజాగా సలార్ మూవీ విషయంలో కూడా కనిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేశారు.
ఏకంగా 11 సెట్స్ ని సలార్ కోసం డిజైన్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన బాధలో ఉన్నారు. కుటుంబం మొత్తం ఇప్పుడు ఆ ఎమోషనల్ మూడ్ లోనే ఉంటారు. ఇక ప్రభాస్ కి పెదనాన్న అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఇక అతని దినకర్మకి సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ తాజాగా సలార్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తన వలన టీమ్ మొత్తం ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.