Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ అనంతరం తను చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తన వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి ఇండస్ట్రీలో తన ఎదుగుదలను ప్రోత్సహిస్తూ తన ఎదుగుదలను చూసి ఎంతో మురిసిపోయిన నటుడు కృష్ణంరాజు మరణించడం ప్రభాస్ ను ఎంతగానో కృంగతీసింది.ఇలా ప్రభాస్ ప్రస్తుతం తన పెదనాన్న లేరనే బాధలో ఉండగా మరోవైపు ఈయనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున బాలీవుడ్ మీడియా ఈ వార్తలను ప్రచురించడం పై టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా కృతి సనన్ ప్రభాస్ కి ఫోన్ చేసి మాట్లాడటంతో చాలామంది వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు సృష్టించారు.
Prabhas: ప్రభాస్ ఎదుగుదలను ఓర్వలేకే ఇదంతా…
ఈ విధంగా బాలీవుడ్ నటితో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని వీరిద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ కొనసాగుతుందంటూ బాలీవుడ్ మీడియా ప్రభాస్ రిలేషన్ గురించి ఇలాంటి వార్తలు రాయడంతో టాలీవుడ్ మీడియాతో పాటు ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ఉన్న పరిస్థితి ఏంటి అతని గురించి ఇలాంటి వార్తలు రాయడం ఏంటి అంటూ ప్రభాస్ అభిమానులు మండిపడగా మరి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా ఎదగడం ఓర్వలేకే అతనిపై బాలీవుడ్ మీడియా ఇలాంటి విష ప్రచారం చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున బాలీవుడ్ మీడియాను తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన సినిమా షూటింగులకు బ్రేక్ చెప్పి తన పెదనాన్నకు చేయాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి జరిపిస్తున్నారు.