Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. తెలుగు సినిమా పేరు ప్రతిష్టలను పెంచిన స్టార్ల జాబితాలో టాప్ లో ప్రభాస్ ఉంటాడు. బాహుబలి తర్వాత పలు సినిమాలు చేసినా కానీ తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే హిందీ జనాలకు మాత్రం సాహో సినిమా బాగా నచ్చింది.
సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్.. ఇంకా పెళ్లి చేసుకోలేదు. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ పలు సినిమాలు చేయగా.. వీరిద్దరి కాంబినేషన్ పెద్ద హిట్ అయింది. పైగా వీరు సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో దగ్గరగా కనిపించడంలో అందరూ వీరిద్దరు లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చర్చించుకున్నారు.
తాజాగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్6’ షోలో అనుష్క గురించి చర్చ వచ్చింది. ప్రభాస్-అనుష్కల మధ్య ఏం నడుస్తోందంటూ కరణ్ కొంత ఆరా తీయడానికి ప్రయత్నించాడు. అనుష్కతో డేటింగ్ చేయడం గురించి, డేటింగ్ పుకార్ల గురించి కరణ్ ప్రశ్నించాడు.
Prabhas:
అయితే కరణ్ జోహార్ కు ప్రభాస్ కౌంటర్ ఇచ్చాడు. కరణ్ జోహార్ పదేపదే అనుష్కతో ప్రభాస్ రిలేషన్ గురించి ఆరా తీయగా.. దానిని ప్రభాస్ ఖండించాడు. ప్రభాస్ దీనికి సమాధానమిస్తూ.. ‘మీరు వాటిని (డేటింగ్ రూమర్లను) ప్రారంభించారు’ అని సమాధానం ఇచ్చారు. అంటే పరోక్షంగా కరణ్ జోహారే ఇలాంటి తన డేటింగ్ రూమర్లను పుట్టించాడని ప్రభాస్ తేల్చేశాడు.