యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తన హవా కొనసాగిస్తున్నాడు. అతని సినిమాల బిజినెస్ ప్రస్తుతం వెయ్యి కోట్ల వరకు ఉంది. అలాగే ప్రభాస్ తో సినిమా అంటే కచ్చితంగా 150 కోట్ల బడ్జెట్ర్ రెడీ చేసుకొని దిగాలని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆ రేంజ్ లో బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్న మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీ లేవు. సలార్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ నెక్స్ట్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ఎక్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాని ఇండియన్ హాలీవుడ్ మూవీగా ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఏకంగా 400 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాతో ఫారిన్ మార్కెట్ పైన కూడా కన్నేస్తున్నారు.
ఈ మధ్యలో ప్రభాస్ సడెన్ గా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాలు చేసే మారుతికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ప్రభాస్ ఫాన్స్ కి మాత్రం మారుతితో సినిమా ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ మధ్య కాలంలో మారుతి నుంచి సరైన సక్సెస్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన పక్కా కమర్షియల్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో సినిమాపై ప్రభాస్ ఫాన్స్ టెన్షన్ గా ఉన్నారు. బాహుబలి తర్వాత వచ్చిన రెండు పాన్ ఇండియా మూవీలు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు. ఇలాంటి సమయంలో సక్సెస్ లేని మారుతితో సినిమా వద్దే వద్దు అంటూ ప్రభాస్ ఫాన్స్ రచ్చ చేస్తున్నారు.
రాజా డీలక్స్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఫాన్స్ నుంచి వ్యతిరేకత వస్తున్న కూడా సడెన్ గా ఈ మూవీ పూజా కార్యక్రమానికి రెడీ అయిపొయింది. ప్రభాస్ కూడా డేట్స్ ఇవ్వడంతో మారుతి సినిమా స్టార్ట్ చేసేస్తున్నాడు. దీంతో నిన్నటి నుంచి ట్విట్టర్ లో ఈ సినిమా వద్దని అంటూ ప్రభాస్ ఫాన్స్ మారుతిపై ట్విట్టర్ హ్యాష్ టాగ్ తో ట్రోల్ చేస్తున్నారు. బ్యాన్ మారుతి టీఎఫ్ఐ పేరుతో హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. మెజారిటీగా ప్రభాస్ ఫాన్స్ దీనిని ట్రెండ్ చేస్తూ ఉండటం విశేషం. మరి దీనిపై మారుతి కానీ, ప్రభాస్ కానీ స్పందిస్తారేమో చూడాలి.