యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదు ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. అలాగే రెండు వేల కోట్ల వరకు ఆయన మీద నిర్మాతలు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మరో సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది. ఖైది సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన తమిళ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమల్ హసన్ తో విక్రమ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీస్ అన్ని కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతున్నాయి.
ఈ కథలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అలాగే హీరో పాత్రలకి కూడా సీక్వెల్ లీడ్ ఉంటుంది. ఇక ఖైది, విక్రమ్, ఇప్పుడు విజయ్ సినిమాలలోని హీరో పాత్రలని కొనసాగిస్తూ ఆ ముగ్గురుతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ప్రభాస్ కూడా వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అదిరిపోయే స్టొరీ లైన్ ని ప్రభాస్ కి లోకేష్ నేరేట్ చేయడం జరిగింది అని తెలుస్తుంది.
ఇక లోకేష్ కి కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి కనీసం నాలుగేళ్ళు పట్టే ఛాన్స్ ఉంది. అలాగే లోకేష్ ఖైది, విక్రమ్ సీక్వెల్స్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.