Prabhas: టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ సినిమా తర్వాత ఈయన చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం నాలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో షూటింగ్ పనులను జరుపుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్కతో కలిసి ఎక్కువ సినిమాలలో చేయడం వల్ల ఈయన అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇలా అనుష్క ప్రభాస్ గురించి వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించి మేమిద్దరం మంచి స్నేహితులమని తెలియజేశారు. దీంతో అనుష్క ప్రభాస్ కి సంబంధించిన వార్తలకు పులిస్టాప్ పడ్డాయి.అయితే తాజాగా ఈయన బాలీవుడ్ నటి కృతి సనన్ తో ప్రేమలో ఉన్నారంటూ మరోసారి వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇలా వీరీ గురించి అనుమానాలు రావడానికి గల కారణం నటి కృతి సనన్ కరణ్ జోహార్ కార్యక్రమంలో పాల్గొని ఎవరైనా మీ కోస్టార్ కి ఫోన్ చేసి తనకు హాయ్ చెప్పామని అడిగారు అలా ఎవరు చేస్తే వారికి రెండు పాయింట్లు అని చెప్పడంతో వెంటనే కృతి సనన్ ప్రభాస్ కి కాల్ చేశారు.
Prabhas: ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేసిన కృతి సనన్
ఇలా ప్రభాస్ కి కాల్ చేసిన అనంతరం ఆమె కరణ్ కి హాయ్ చెప్పించడమే కాకుండా థాంక్యూ సో మచ్ యువర్ సో క్యూట్ ఈ షో పూర్తి కాగానే తనని కలుస్తానని కృతి సనన్ చెప్పగా ప్రభాస్ ఓకే టేక్ కేర్ అంటూ జాగ్రత్తలు చెప్పారు. ఇక వీరిద్దరూ ఆది పురుశ్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. షూటింగ్ లొకేషన్లో కూడా వీరిద్దరూ తరచూ ముచ్చట్లు పెట్టుకొని కూర్చుని ఉంటారని పలువురు వెల్లడించారు. వీరిద్దరి వ్యవహారం చూస్తుంటే ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు. అయితే వీరి ప్రేమ గురించి వస్తున్న వార్తల్లో విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.