Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మొన్న అంటే తన పెద్దనాన్న కృష్ణంరాజు మరణ సమయంలోనూ.. ఆ తరువాత జరిగిన కార్యక్రమంలోనూ బాగానే కనిపించాడు. కానీ సడెన్‌గా ఆయనకు ఏమైంది? సపోర్ట్ లేనిదే చెప్పులు వేసుకోలేకపోతున్నాడు.. మెట్లు దిగేందుకు సైతం ఇబ్బంది పడుతున్నాడు. స్టార్ హీరోలంటే మన మాదిరిగా అడ్డమైనవన్నీ పొట్టలో వేసేయరు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారు. మంచి హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అలాంటప్పుడు నాలుగు పదుల వయసు వచ్చీ రాక ముందే ప్రభాస్‌కి నడవలేని స్థితా? అసలు ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘ఆది పురుష్’ చుట్టూనే టాక్ అంతా నడుస్తోంది. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దానిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. టీజర్‌పై టాక్‌ను పక్కనబెడితే ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ అయోధ్యలో నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రభాస్ అయోధ్యకు వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ దృశ్యం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ప్రభాస్ అక్కడ నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. సపోర్ట్ లేకుండా చెప్పులు వేసుకోలేకపోవడం.. కనీసం మెట్లు కూడా సపోర్ట్ లేకుండా దిగలేకపోతున్నాడు.
Prabhas : ఆ కారణంగానే నొప్పి తిరగబెట్టిందని టాక్
ప్రభాస్ పక్కనే ఉన్న డైరెక్టర్ ఓం రౌత్, కృతి సనన్ సపోర్ట్‌తో చెప్పులు వేసుకుని.. అనంతరం వారి సపోర్ట్‌తోనే మెట్లు దిగాడు. ఈ విషయం వీడియోలను చూసి తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందంటూ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆపరేషన్ అనంతరం చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం రెండు నెలల పాటైనా రెస్ట్ తీసుకోవాలి. కానీ ప్రభాస్ అలాంటివేం చేయలేదు. ఆ కారణంగానే నొప్పి తిరగబెట్టిందని టాక్. ఇదంతా కూడా బాహుబలి షూటింగ్ వల్లనేనని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ సమయంలో ప్రభాస్‌కు గాయమైందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం క్లియర్‌గా గమనిస్తే నిలబడటానికి కూడా ప్రభాస్ ఇబ్బంది పడుతున్న విషయం తెలుస్తుంది.