Prabhas Billa: రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ బిల్లాను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ సినిమా రెబల్ ను విడుదల చేశారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే పాత బ్లాక్ బాస్టర్ సినిమాల రీ రిలీజ్. స్టార్ హీరోల పుట్టిన రోజుల నేపథ్యంలో కెరీర్ లో హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. వాటికి ఆదరణ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. సీట్లు, బిగ్ స్క్రీన్ లను చించేస్తూ హంగామా సృష్టిస్తున్నారు.
రీరిలీజ్ సినిమాలకు ఫ్యాన్స్ రచ్చ..
రీరిలీజ్ అయిన చిత్రాలకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన పోకిరి, పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు, జల్సా చిత్రాలు రీరిలీజ్ చేశారు. వాటికి కోట్లాది రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. పవన్ జల్సా సినిమాకైతే ఏకంగా 4 కోట్లు వచ్చాయట. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ చిత్రం వస్తోంది. ఆయన బర్త్ డేకి బిల్లా మూవీని మళ్లీ థియేటర్లలో చూసే అవకాశం దక్కింది.
Prabhas Billa:
అయితే, ముందుగా అనుకున్న ప్రకారం వర్షం సినిమా విడుదల చేయాలని అనుకున్నారట. అయితే, అనూహ్యంగా ఆ చిత్రాన్ని కాకుండా బిల్లా వైపే మొగ్గు చూపారు. ఈనెల 15న రెబల్ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బిల్లా సినిమాను 4కే వెర్షన్ లో ఈనెల 22న విడుదల చేయనున్నారు. ఈ మేరకు కృష్ణం రాజు కుమార్తె ప్రసీద, దర్శక నిర్మాతలు మెహర్ రమేష్, గోపీకృష్ణ మూవీస్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ సినిమా ద్వారా వచ్చ కలెక్షన్లను యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ కు విరాళంగా అందజేస్తారట.