Prabhas: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నయా ట్రెండ్ ఒకడి నడుస్తోంది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా వారి కెరీర్ లో రికార్డులను బ్రేక్ చేసిన సినిమాలను థియేటర్లలో 4k క్వాలిటీతో రీరిలీజ్ చేస్తున్నారు. ఇలా విడుదలైన సినిమాలకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు, అదిరిపోయే సినిమా చూడటం అనేది అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతోంది.
టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాలు ఇలా పుట్టినరోజుల్లో విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను 4K క్వాలిటీతో రీరిలీజ్ చేయగా.. ఇది అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఘరానా మొగుడు’ సినిమాను రీరిలీజ్ చేయగా.. ఇది కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలైన ‘తమ్ముడు’, ‘జల్సా’ సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ అవగా.. అభిమానులు పోటెత్తారు. ఇప్పుడు ఇదే బాటలో ప్రభాస్ సినిమా కూడా రాబోతోంది.
Prabhas: ప్రభాస్ ‘బిల్లా’ రీరిలీజ్…
అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ హిట్ సినిమా ‘బిల్లా’ను 4k క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయనున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా.. అభిమానులు కోలాహలం చేయడానికి రెడీ అయిపోయారు. ‘బిల్లా’ సినిమా రిలీజ్ కు సంబంధించి డైరెక్టర్ మెహర్ రమేష్ ఈమేరకు ట్వీట్ చేశాడు.
My most stylish DON ever #Billa4k #Prabhas 🔥
Special shows for his Birthday 23rd October 💥@GopiKrishnaMvs prestigious presentation
"Film Digitization, Colour Grading and Restoration in 4K done by Prasad" #RebelStar #krishnamrajugaru #ForeverInOurHearts pic.twitter.com/GruG0u4XUC— Meher Raamesh (@MeherRamesh) October 14, 2022