యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఉన్నారు. దాంతో పాటు ప్రాజెక్ట్ కె సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. ఇదిలా ఉంటే మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ మూవీని కేవలం రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేయడానికి మారుతీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మారుతీ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ని మారుతి రంగంలోకి దించుతున్నాడు అనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. బాహుబలి సినిమాలో ప్రభాస్, సత్యరాజ్ కాంబినేషన్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అందులో ప్రభాస్ సత్యరాజ్ కట్టప్ప పాత్రని తాత అని పిలుస్తాడు. ఇక మారుతీ సినిమాలో వీరిద్దరూ తాతామనవడు పాత్రలలోనే కనిపించబోతున్నట్లు టాక్. ఇద్దరి మధ్య ఫన్ జోనర్ ఎక్కువగా ఉంటుందని కూడా తెలుస్తుంది. మొదటి సారి ప్రభాస్ కామెడీ హర్రర్ జోనర్ కావడంతో సరికొత్తగా ఇతని పాత్ర ఉంటుందని, ఫుల్ కామెడీతో ప్రేక్షకులని అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమా కోసం తక్కువ కాల్ షీట్స్ ప్రభాస్ కేటాయించాడని తెలుస్తుంది. త్వరలో ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నుంచి దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ రాబోతుంది. దీని కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే రాజా డీలక్స్ సినిమా నుంచి కూడా కీలక అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది.