Prabas Srinu and Tulasi: కమెడియన్ ఆలీ ఈటీవీ సౌజన్యంతో ఆలీతో సరదాగా కార్యక్రమం చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. సినిమా రంగానికి చెందిన పలువుర్ని ఈ షోకు పిలుస్తుంటాడు. ఈ నేపథ్యంలో షోకు వచ్చిన గెస్టులే ఆశ్చర్యపోయేలా క్వశ్చన్లు అడుగుతుంటాడు ఆలీ. ఒక్కోసారి ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ షోకు వస్తుంటారు. ఇందులో సీనియర్ హీరోయిన్లు, వెటరన్ నటులు కూడా ఉంటారు. ఒక్కోసారి మ్యూచువల్ గా ఇద్దరు నటీనటులు కూడా హాజరవుతుంటారు.
ఓ నటుడు, నటీమణి వచ్చారంటే ఇక రూమర్లు క్రియేట్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఆలీ చాలా చిలిపి ప్రశ్నలు, కొంటె ప్రశ్నలు వేస్తూ షోను ఉత్సాహంగా నడిపేందుకు కృషి చేస్తుంటాడు. తాజాగా ఈ షోకు సీనియర్ నటి, ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్తుగా సెటిలైన తులసి హాజరయ్యారు. ఈమెతో పాటు మరో క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్రభాస్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో పాపులర్ పేరు సంపాదించుకున్న ప్రభాస్ శ్రీను వచ్చారు.
ఆలీతో షోకు ఈ ఇద్దరినీ పిలవడంపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు నటీనులు కాస్త క్లోజ్ గా ఉన్నారంటే వారిపై ఇక గాసిప్స్ మొదలవుతాయి. ఆడ, మగ సెలబ్రిటీలు కాస్త దగ్గరగా ఉన్నారంటే ఇక అంతే సంగతులు. వారిపై బోలెడు వార్తులు, పుకార్లు షికార్లు చేస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ శ్రీను, సీనియర్ నటి తులసి గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Prabas Srinu and Tulasi: షోకు పాపులారిటీ కోసమేనా?
తాజాగా ఆలీతో సరదాగా షోలో ఈ ఇద్దరితో ప్రోమో వదిలారు. తులసి వయసు ప్రస్తుతం 55. ప్రభాస్ శ్రీను వయసు 43 ఏళ్లు. వీరిద్దరూ కలిసి షోకు రావడంతో అట్రాక్షన్ మొదలైంది. అప్పట్లో డార్లింగ్ చేశాం కదా.. అప్పుడే ఈవిడ తగిలింది అంటూ ప్రభాస్ శ్రీను ప్రోమోలో చెబుతారు. దీంతో గాసిప్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. అసలు ఆ షోలో చెప్పిందేమిటో, జరిగిందేమిటో తెలియకుండానే కథలు కథలుగా అల్లేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల షోకు మరింత ఆదరణ వస్తుందని ఆలీనే చేయిస్తున్నాడనే వాదన కూడా ఉంది.