పూనమ్ కౌర్… ఈ పేరు టాలీవుడ్ లో సినిమా హీరోయిన్ గా కంటే వివాదాల కేరాఫ్ గా అందరికి బాగా సుపరిచితం అయ్యింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, చెల్లి పాత్రలు, ఫ్రెండ్ పాత్రలలలో కూడా నటించింది. అయితే ఏ ఒక్కటి ఆమెకి నటిగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అనే హోదాని చంద్రబాబు హయాంలో సంపాదించింది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అనే విషయం సంచలనంగా మారింది. ఇక ఆ తరువాత కత్తి మహేష్ పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెంచు సంచలనంగా మారాయి.
అప్పటి నుంచి రాజకీయ పార్టీలు కూడా ఆమెని పవన్ కళ్యాణ్ ని ఇరికించడానికి ఏదో ఒక సందర్భంలో బయటకి లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు . ఆమె మీద రకరకాల పోస్ట్ లు పెట్టి వేధిస్తున్నారు. ఇక తెలుగు ప్రజల అందరికి పూనమ్ కౌర్ సుపరిచితం అయ్యింది. ఇక ట్విట్టర్ లో ఆమె పెట్టె పోస్టులు కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. అంతలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటుంది. పలు ఇంటర్వ్యూలలో కూడా పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానాన్నిచూపిస్తూ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ గా మారాయి. దీనికి కారణం ఆమె ఒక మతానికి సంబందించిన దేవుడుగా కొలుచుకొనే జీసస్ మీద కామెంట్స్ చేయడమే. జీసస్ ఎవరికి పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? ఈ విషయంలో తనకి సందేహాలు ఉన్నాయి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తాను పెద్దగా చదువుకోకపోవడం వలన ఇలాంటి విషయాల మీద అవగాహన లేదు అంటూ కామెంట్స్ చేసింది. దీనిపై క్రిస్టియన్స్ ఒక్కసారిగా విమర్శలు స్టార్ట్ చేశారు. ఆ వర్గానికి చెందిన వారందరికీ పూనమ్ కౌర్ వ్యాఖ్యలు కోపాన్ని తెప్పిస్తున్నాయి. మా దేవుడు గురించి మాట్లాడితే మీ దేవుళ్ళ పుట్టుక గురించి కూడా ప్రశ్నించాల్సి వస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.